సోషల్ మీడియాలో మహేశ్ బాబుపై సెటైర్లు!
Advertisement
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రో రెండు రోజుల క్రితం విడుదలకాగా, ఈ సినిమాలో మహేశ్ లుక్‌ గత సినిమాల్లో మాదిరిగానే ఉందని, ఆయన కొత్తగా ఏమీ ట్రై చేయలేదని సెటైరికల్ కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మహేశ్ సినిమాలు హిట్ అవుతున్నా, లుక్స్ పరంగా ప్రయోగాల జోలికి మాత్రం మహేశ్ వెల్లడం లేదు. కధ, కథనాలు ఎలా ఉన్నా, ఆయన ప్రతి చిత్రంలో ఒకేలా కనిపిస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.

ఇటీవలి 'మహర్షి'లో కొంచెం కొత్తగా మహేశ్ ట్రై చేసినా, పాత లుక్స్ తో పోలిస్తే, పెద్దగా మార్పు మాత్రం కనిపించలేదు. ఇక, 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రోలో సైతం మహేశ్ తన రొటీన్‌ లుక్‌ లోనే కనిపించాడు. గతంలో అల్లు అర్జున్‌ మిలిటరీ అధికారిగా, రామ్‌ చరణ్‌ పోలీసుగా కనిపించిన వేళ, తమ క్యారెక్టర్‌ కోసం వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మారినట్టు కనిపించారు. మహేశ్ మాత్రం అటువంటి ప్రయోగాల జోలికి పోకపోవడంపై సినీ అభిమానుల నుంచి సెటైర్లు వస్తున్నాయి.
Sun, Aug 11, 2019, 10:19 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View