ఆస్ట్రేలియాలో ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న విజయ్ సేతుపతి
Advertisement
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఆస్ట్రేలియాలో ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నాడు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత చలన చిత్రోత్సవాల్లో విజయ్ సేతుపతి ఈ అవార్డును అందుకున్నాడు. ఈ చిత్రోత్సవాల్లో 60కిపైగా భారతీయ సినిమాలను ప్రదర్శించారు. ఇందులో కుమార రాజా త్యాగరాజ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమా కూడా ఉంది. ఈ చిత్రానికి గాను ఆయనకు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. పలువురి ప్రముఖుల చేతుల మీదుగా సేతుపతి ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, టబులతోపాటు నటి గాయత్రి ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు.

Sun, Aug 11, 2019, 08:27 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View