ఇది తెలుగు సినిమా కాదు... హాలీవుడ్ రేంజ్... ఇక సిక్సర్లే సిక్సర్లు: నటుడు బ్రహ్మాజీ
Advertisement
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన 'సాహో' ధియేటరికల్ ట్రయిలర్ నిన్న విడుదలై, సునామీ సృష్టిస్తున్న వేళ, ట్రయిలర్ తెలుగు సినిమా మాదిరిగా లేదని, హాలీవుడ్ రేంజ్ లో ఉందని నటుడు బ్రహ్మాజీ పొగడ్తల వర్షం కురిపించాడు. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైన సంగతి తెలిసిందే. ట్రయిలర్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

నటుడు బ్రహ్మాజీ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, ‘హాలీవుడ్ మూవీనా? తెలుగు మూవీనా? ఇంటర్నేషనల్ స్టేడియంలో సిక్సర్లు పక్కా. ప్రభాస్ అద్భుతమైతే, డైరెక్టర్ సుజీత్ సూపర్’’ అని వ్యాఖ్యానించాడు. కాగా, 'సాహో' ట్రయిలర్ యూ ట్యూబ్ లో ఇప్పుడు నంబర్ 1 ట్రెండింగ్ లో సాగుతూ, లక్షకు పైగా లైక్స్, 15 లక్షలకు పైగా వ్యూస్ తో దూసుకెళుతోంది.
Sun, Aug 11, 2019, 06:58 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View