సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  'మళ్లీ సీత లాంటి పాత్ర వస్తే చేయడానికి తాను సిద్ధమే' అంటోంది కథానాయిక కాజల్. తేజ దర్శకత్వంలో వచ్చిన 'సీత' చిత్రం అపజయం పాలైంది. అయినా కూడా ఆ సినిమా అంటే తనకి ఇష్టమని చెబుతోంది కాజల్. 'ఆ సినిమాలోని పాత్ర, నా నటన ఎప్పటికీ నాకు ఇష్టమే. అయితే సినిమా రిజల్ట్ మాత్రం సరిగా రాలేదు. అయినా అలాంటి పాత్ర వస్తే చేయడానికి నేను రెడీనే' అని చెప్పింది కాజల్.  
*  ప్రముఖ నటి టబు ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. అలాగే, రానా నటించే 'విరాట పర్వం 1992' చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి కూడా ఒప్పుకుంది. అయితే, తాజాగా రానా చిత్రం నుంచి ఆమె తప్పుకున్నట్టు సమాచారం. ప్రాజక్టు ఆలస్యం కావడంతో డేట్స్ సమస్య వచ్చి చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది.
*  కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందే 'భారతీయుడు 2' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ నెల మూడో వారం నుంచి రాజమండ్రి పరిసరాల్లో జరుగుతుంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా కొంత షూటింగ్ చేస్తారట.
Sat, Aug 10, 2019, 07:32 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View