ముఖ్యమంత్రిని కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదు: పృథ్వి వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్ కౌంటర్
Advertisement
జగన్ సీఎం అయిన తర్వాత అభినందించడానికి సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా రాలేదని ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్, సినీ నటుడు పృథ్వి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదని ఆయన అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారు ముఖ్యమంత్రిని కలవాలనే నిబంధన ఏమీ లేదని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ సెటిల్ అయిన తర్వాత కలుస్తామని అన్నారు. జగన్ తో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని... ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు.

వాస్తవానికి జగన్ ను రేపు కలవాల్సి ఉందని... అయితే ఇతర బిజీ షెడ్యూల్ వల్ల మరో రెండు, మూడు రోజుల్లో కలిసేందుకు ఆయన అవకాశమిచ్చారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, ఈ మేరకు వ్యాఖ్యానించారు.
Fri, Aug 09, 2019, 03:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View