సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  అందాల రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటోందట. ప్రస్తుతం ఆమె 'మార్జావాన్' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఓ చోట ఈ చిన్నది బెల్లీ డ్యాన్స్ చేయాల్సివుందట. అందుకని ప్రస్తుతం ఆమె ఆ డ్యాన్స్ ను నేర్చుకుంటోందని సమాచారం.
*  కథానాయిక నిత్యామీనన్ తల్లి పాత్రలో కనిపించనుంది. అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో రూపొందుతున్న 'మిషన్ మంగళ్' చిత్రంలో నిత్యా మీనన్ వర్షా గౌడ్ అనే శాస్త్రవేత్త పాత్రలో నటిస్తోంది. ఇందులో ఆమెకు పెళ్లయి, పిల్లలు కూడా వుంటారట.  
*  నాగశౌర్య హీరోగా రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో ముగిసింది. ఇందులో మెహరీన్ కథానాయికగా నటిస్తోంది. 
Fri, Aug 09, 2019, 07:23 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View