అందుకే బిగ్ బాస్ ఆఫర్ ను వదులుకున్నాను: యాంకర్ అనసూయ
Advertisement
అనసూయ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'కథనం' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె బిజీగా వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమాను గురించి మాట్లాడుతూ ఉండగా, 'బిగ్ బాస్' ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆమె స్పందిస్తూ .. 'బిగ్ బాస్' షోను అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వున్న వాళ్లంతా నాకు బాగా పరిచయమున్న వాళ్లే.

బిగ్ బాస్ నుంచి నాకు కూడా ఆఫర్ వచ్చింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కువ రోజులు ఉండలేను. ఫ్యామిలీని వదిలి అన్నేసి రోజులు దూరంగా ఉండటానికి ఎంతో ధైర్యం కావాలి. అంత ధైర్యాన్ని నేను చేయలేను. షూటింగుకి బయటికి వెళితేనే రెండు మూడు సార్లు వీడియో కాల్ చేస్తాను. బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే ఆ అవకాశం ఉండదు. అందుకే వాళ్లు అడిగినా వెళ్లలేదు" అని చెప్పుకొచ్చింది. 
Thu, Aug 08, 2019, 06:38 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View