అప్పట్లో ఆడవాళ్లు నాపై చాలా కోపంగా వుండేవాళ్లు: కైకాల సత్యనారాయణ
Advertisement
తెలుగు తెరపై తిరుగులేని ప్రతినాయకుడిగాను .. క్యారెక్టర్ ఆర్టిస్టుగాను కైకాల సత్యనారాయణ ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. నవరస నట సార్వభౌముడిగా ప్రేక్షకులచే ప్రశంసలు అందుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "అప్పట్లో విలన్ గా చాలా సినిమాల్లో చేశాను .. ఆ పాత్రల్లో ఆడవాళ్లను హింసించేవి కూడా వున్నాయి. దాంతో ఆడవాళ్లకు నాపై చాలా కోపంగా ఉండేది.

ఒకసారి ఒక పబ్లిక్ ఫంక్షన్ కి వెళితే ఒకావిడ 'ఈ సత్తిగాడిని వెనక నుంచి పొడిచేయాలి' అందట. మరొకావిడ 'ఆడపిల్ల జీవితాలను ఎందుకయ్యా అట్లా నాశనం చేస్తావు .. నీకు అక్కా చెల్లెళ్లు లేరా?' అని అడిగిందట. ఒక విలన్ ను ప్రేక్షకులు తిట్టుకుంటే అతను ఆ పాత్రను బాగా చేసినట్టే. అందుకే వాళ్లు అలా అన్నందుకు నేను బాధపడకుండా నవ్వుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
Thu, Aug 08, 2019, 05:36 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View