రవితేజ అభిమానుల టెన్షన్ అదే!
Advertisement
రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతోంది. ఈ సినిమాలో చాలాకాలం పాటు కోమాలో వుండి బయటికి వచ్చిన వ్యక్తిగా రవితేజ కనిపిస్తాడట. తను కోమాలోకి వెళ్లక ముందున్న పరిస్థితులు వేరు .. బయటికి వచ్చిన తరువాత పరిస్థితులు వేరు. కొత్తగా వచ్చిన మార్పులకు అడ్జెస్ట్ కాలేక రవితేజ పడే ఇబ్బందులతో ఈ కథ సాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, దాదాపు ఇదే తరహా కథతోనే తమిళంలో జయం రవి హీరోగా 'కోమాలి' నిర్మితమైంది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. దాంతో రవితేజ సినిమా కాన్సెప్ట్ లోని కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతారేమోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Thu, Aug 08, 2019, 12:53 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View