విజయ్ తదుపరి సినిమాలో కైరా అద్వాని?
Advertisement
'భరత్ అనే నేను'తో తెలుగు తెరకి కైరా అద్వాని పరిచయమైంది. తొలి సినిమాతోనే మహేశ్ జోడీగా ఛాన్స్ కొట్టేయడంతోనే అమ్మడు అదృష్టవంతురాలని అంతా అనుకున్నారు. ఆ సినిమా హిట్ కావడంతో అదే నిజమైంది. ఇక హిందీలో ఇటీవల ఆమె చేసిన 'కబీర్ సింగ్' కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో తెలుగు .. హిందీ భాషల నుంచి ఆమెకి అవకాశాలు 'క్యూ' కడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సుందరిని తమ ప్రాజెక్టులలోకి తీసుకోవడానికి కోలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఆ తరువాత విజయ్ చేయనున్న సినిమాలో కథానాయికగా కైరా అద్వానిని తీసుకోవడానికిగాను సంప్రదింపులు మొదలయ్యాయట. విజయ్ వంటి స్టార్ హీరో జోడీగా ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు? అందుకే ఈ సినిమాలో నాయికగా ఆమె ఖాయమైపోయినట్టే అనుకుంటున్నారు. 
Thu, Aug 08, 2019, 12:28 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View