హాలీవుడ్ విలన్ రియల్ హీరోగా మారిన వేళ.. చిన్నారిని కాపాడిన డానీ ట్రేజో!
Advertisement
హాలీవుడ్ సినిమాల్లో విలన్ నిజజీవితంలో హీరోగా మారాడు. కారు ప్రమాదంలో చిక్కుకున్న పాపను కాపాడి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాస్ ఏంజెల్స్ లోని ఓ ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఓ కారు పల్టీ కొట్టింది.

దీంతో అటుగా వెళుతున్న హాలీవుడ్ నటుడు డానీ ట్రేజో వెంటనే అక్కడకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. పల్టీ కొట్టిన కారును తొంగిచూడగా అందులో చిన్నారి చిక్కుకుని కనిపించింది. ఆమెను బయటకు తీసేందుకు డానీ ప్రయత్నించినా వీలుకాలేదు. దీంతో మరో వ్యక్తి సాయం తీసుకున్న డానీ పాపను సురక్షితంగా బయటకు తీశాడు.

ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వీరిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. చిన్నారి బాబు ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై డానీ ట్రేజో స్పందిస్తూ.. ప్రజలకు సాయం చేయడం కారణంగానే తనకు మంచి జరిగిందని వ్యాఖ్యానించారు. మరోవైపు డానీ తీసుకున్న చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Thu, Aug 08, 2019, 12:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View