విధి రాతను నేను నమ్మను: హీరోయిన్ నిధి అగర్వాల్
Advertisement
తెలుగు తెరకి కథానాయికగా 'సవ్యసాచి' సినిమాతో నిధి అగర్వాల్ పరిచయమైంది. అయితే ఆ సినిమా ఆమెను ఒక రేంజ్ లో నిరాశ పరిచింది. అయినా ఆ వెంటనే అఖిల్ జోడీగా ఛాన్స్ కొట్టేసి 'మిస్టర్ మజ్ను' చేసేసింది. ఆ సినిమా కూడా ఆమెకి కలిసిరాలేదు. ఇక నిధి తట్టా బుట్టా సర్దుకోవడమే ఆలస్యమని అంతా అనుకుంటూ ఉండగా, 'ఇస్మార్ట్ శంకర్'లో అవకాశాన్ని చేజిక్కించుకుంది.

ఈ సినిమా ఆమెకి భారీ విజయాన్ని అందించింది. దాంతో ఇప్పుడు ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో మరింత దూకుడు పెంచింది. తాజాగా తన హాట్ లుక్ ను పోస్ట్ చేస్తూ, 'విధి రాతను నేను నమ్మను .. గెలుపొందడం .. గమ్యం చేరుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది' అనే కామెంట్ పెట్టింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో ఆమె జోరు పెరిగే అవకాశాలు ఎక్కువగానే వున్నాయనే అభిప్రాయాలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.
Thu, Aug 08, 2019, 12:04 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View