'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' వేట మొదలంటున్న రామ్ గోపాల్ వర్మ!
Advertisement
వివాదాస్పద చిత్రాల దర్శకుడు, ఏదో ఒక కాంట్రవర్శీతో నిత్యమూ వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ, తన తాజా చిత్రం గురించిన లేటెస్ట్ అప్ డేట్ ను అభిమానులకు అందించాడు. కొత్త చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తొలి సాంగ్ ట్రయిలర్ రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించాడు. ఈ చిత్రాన్ని మోస్ట్ నాన్ కాంట్రవర్శియల్ చిత్రంగా వర్మ పేర్కొనడం గమనార్హం. కాగా, ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న వర్మ, దీనికి సంబంధించిన వివరాలను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతుండటం గమనార్హం. 
Thu, Aug 08, 2019, 11:59 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View