'సాహో' నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది
Advertisement
ప్రభాస్ అభిమానులంతా 'సాహో' కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ ప్రేక్షకులను కూడా అదే రోజున పలకరించనుంది. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా నుంచి, ఈ నెల 10వ తేదీన ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచేలా దర్శక నిర్మాతల నుంచి గట్టి కసరత్తు జరుగుతోందట. ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ 5 కోట్ల పారితోషికాన్ని తీసుకోగా, ప్రభాస్ కి లాభాల్లో వాటాగా పెద్ద మొత్తమే ముట్టనుందని చెప్పుకుంటున్నారు. హాలీవుడ్ స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాను చూడటానికి ప్రభాస్ అభిమానులంతా ఉవ్విళ్లూరుతున్నారు. 
Thu, Aug 08, 2019, 11:27 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View