'గ్యాంగ్ లీడర్'కి కొత్త రిలీజ్ డేట్?
Advertisement
నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే రోజున 'సాహో' విడుదలకి ముహూర్తం ఖరారు కావడంతో, ఈ సినిమా దర్శక నిర్మాతలు వాయిదా వేసుకున్నారు.

సెప్టెంబర్ 20వ తేదీకి ఈ సినిమా వెళ్లొచ్చనే టాక్ వినిపించింది. కానీ అంతకి ఒక వారం ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయం జరిగిపోయినట్టు సమాచారం. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు చెబుతున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. ప్రతినాయకుడిగా కార్తికేయ నటించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.
Thu, Aug 08, 2019, 11:15 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View