సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మిస్ ఇండియా' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది.
*  హీరో ప్రభాస్ తన 'సాహో' సినిమా ప్రమోషన్ కోసం త్వరలో ఐదు ప్రధాన నగరాలకు టూర్ చేయనున్నాడు. ముందుగా ముంబైలో ఈ చిత్రం ట్రైలర్ విడుదల వేడుకలో పాల్గొని, అనంతరం హైదరాబాదు, చెన్నై, కొచ్చి, బెంగళూరు లలో జరిగే వేడుకల్లో పాల్గొంటాడు. ఆయనతో పాటుగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా పాల్గొంటుంది.
*  ఏఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత జయలలిత బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటించే ఈ చిత్రంలో ఎమ్జీఆర్ పాత్రను ప్రముఖ నటుడు అరవింద స్వామి పోషించనున్నట్టు సమాచారం. 
Thu, Aug 08, 2019, 07:19 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View