బిగ్‌బాస్: ఫిజికల్ టాస్క్‌గా మారిన సరదా టాస్క్.. అలీ ముఖంపై తన్నిన హిమజ
Advertisement
బిగ్‌బాస్ హౌస్‌లో బుధవారం పెద్ద గొడవే జరిగింది. బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్ టాస్క్‌ను పూర్తి చేసే క్రమంలో సభ్యుల మధ్య గొడవ జరిగి తన్నులాట వరకు వెళ్లింది. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా  శ్రీముఖి, రవికృష్ణ, అషు రెడ్డి తదితరులు దొంగలుగా మారి నిధిని కొట్టేసే ప్రయత్నం చేయగా, వరుణ్, రాహుల్, వితికా, తమన్నా, మహేశ్‌ అండ్ బ్యాచ్ నిధిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్, శివజ్యోతిలు పోలీసులుగా, హిమజ లాయర్‌గా వ్యవహరించింది.
 
ఈ క్రమంలో ఇంట్లో నీళ్లు తాగేందుకు వెళ్లిన హిమజను అలీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో రెండోసారి ఆమె జేబులో చేయిపెట్టి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేయగా హిమజ అతడి ముఖంపై తన్నింది. దీంతో కోపంతో ఊగిపోయిన అలీ ఆమెపై దాడికి యత్నించాడు. లాగిపెట్టి కొడతానంటూ ఆమెపైకి వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.

చివరికి హిమజ దిగొచ్చి అలీకి క్షమాపణ చెప్పింది. అయినప్పటికీ అలీ వెనక్కి తగ్గకపోవడంతో కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. సింపథీ కోసం కాళ్లపై పడొద్దని అలీ అనడంతో బాత్రూముకు వెళ్లి బోరున విలపించింది.

హిమజకు అండగా వెళ్లిన తమన్నాపైనా అలీ ఎదురుదాడికి దిగడంతో గొడవ పెద్దదైంది. అయితే, ఆ తర్వాత అలీ వచ్చి హిమజతో మాటలు కలపడంతో వివాదం సద్దుమణిగింది.
Thu, Aug 08, 2019, 07:08 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View