'భారతీయుడు 2' విడుదల తేదీ ఖరారు
Advertisement
శంకర్ - కమల్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఇటీవలే ఈ ఇద్దరూ రంగంలోకి దిగారు. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు వచ్చారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయింది.

అడ్డంకులన్నింటినీ తొలగించుకున్న దర్శక నిర్మాతలు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. 2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఆ దిశగానే షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
Wed, Aug 07, 2019, 06:46 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View