తొలి సినిమాకే ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి: సంపూర్ణేశ్ బాబు
Advertisement
సంపూర్ణేశ్ బాబుకి యూత్ లో మంచి క్రేజ్ వుంది. తన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆయన ఆ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కొబ్బరి మట్ట' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, " చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి ఉండటంతో, సినిమాల్లోకి వచ్చాను. నేను 'హృదయ కాలేయం' చేసినప్పుడు 'వీడు హీరో ఏంట్రా' అంటూ చాలా మంది అవమాన పరిచారు. ఆ తరువాత ఆ కామెంట్లు తగ్గుతూ వచ్చాయి. ఇక కొన్ని కారణాల వలన 'కొబ్బరి మట్ట' విడుదల ఆలస్యమైంది. ఆలస్యం అయినందుకు ఒక వైపున బాధపడుతూ వుంటే, విడుదల కాదనే ప్రచారం మరింత బాధ కలిగించింది. ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపిస్తాను. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Wed, Aug 07, 2019, 05:11 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View