'కొబ్బరిమట్ట' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మోహన్ బాబు
Advertisement
తెలుగు తెరపై హాస్యకథానాయకుడిగా సంపూర్ణేశ్ బాబుకి ప్రత్యేకమైన స్థానం వుంది. ఆయన హీరోగా రూపొందిన 'కొబ్బరిమట్ట' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ - మాదాపూర్ లోని సైబర్ కన్వెన్షన్ లో ఈ వేడుకను జరపనున్నారు.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మోహన్ బాబు రానున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా సంపూ స్పందిస్తూ .. "నాలాంటి ఒక చిన్న నటుడు ఫంక్షన్ కి రమ్మని అడిగిన వెంటనే ఆశీర్వదించడానికి విచ్చేస్తున్న రియల్ పెదరాయుడు శ్రీ మోహన్ బాబు గారికి పాదాభివందనాలు" అంటూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలాడు. ఈ సినిమాలో సంపూ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.
Wed, Aug 07, 2019, 02:02 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View