'సాహో' నుంచి కొత్తగా మరో పోస్టర్
Advertisement
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' నిర్మితమైంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఆయా భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు.

శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేశ్ .. అరుణ్ విజయ్ ప్రధానమైన ప్రతినాయకులుగా కనిపించనున్నారు. ఇక మరో కీలకమైన పాత్రను జాకీ ష్రాఫ్ చేశాడు. వాళ్లందరి లుక్స్ తో వదిలిన ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకునేలా వుంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలే అవకాశం వున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ప్రమోషన్స్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగనున్నాడని సమాచారం. 
Wed, Aug 07, 2019, 01:10 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View