సిక్స్ ప్యాక్ తో సిద్ధమవుతోన్న నాని
Advertisement
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలకి నాని కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు. ఈ కారణంగానే ఆయన ఖాతాలో ఎక్కువ విజయాలు కనిపిస్తాయి. ఆయన 24వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గ్యాంగ్ లీడర్' రెడీ అవుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.

ఇక నాని తన 25వ సినిమాను మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేయనున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'వి' అనే టైటిల్ ను కూడా ఆల్రెడీ ఖరారు చేసేశారు. ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడనే టాక్ కూడా బయటికి వచ్చింది. అంతేకాదు ఆయన సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడనేది తాజా సమాచారం. ఇందుకోసం ఆయన జిమ్ లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడట. సుధీర్ బాబు కీలకమైన పాత్రను చేస్తున్న ఈ సినిమాలో నాయికలుగా నివేదా థామస్ .. అదితీరావు కనిపించనున్నారు. 
Wed, Aug 07, 2019, 12:53 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View