కొరటాలతో ఎన్టీఆర్ మూవీ ఇప్పట్లో లేనట్టే
Advertisement
ప్రస్తుతం ఎన్టీఆర్ .. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పట్లో సినిమా లేనట్టేననేది తాజా సమాచారం.

రాజమౌళితో ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా మార్చినాటికి పూర్తవుతుందట. ఆ తరువాత ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా సమాచారం. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత కొరటాలతో ప్రాజెక్టును గురించి ఎన్టీఆర్ ఆలోచన చేసే అవకాశం ఉందని అంటున్నారు. కొరటాల తదుపరి సినిమా చిరంజీవితో వున్న సంగతి తెలిసిందే.
Wed, Aug 07, 2019, 12:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View