'సాహో' కోసం పెద్ద మొత్తంలో పారితోషికం అందుకున్న శ్రద్ధా కపూర్
Advertisement
తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మింతమైన సినిమాల జాబితాలో 'సాహో' చేరబోతోంది. ఈ సినిమాతో శ్రద్ధా కపూర్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న ఆమెకి ఈ సినిమా కోసం ఎంత పారితోషికం ఇచ్చి వుంటారనే ఆసక్తిని అభిమానులు కనబరుస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె 5 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

కాజల్ .. తమన్నా .. త్రిష వంటి సీనియర్ నాయికలు సినిమాకి ఒకటిన్నర నుంచి రెండు కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు. నయనతార మాత్రం సినిమాకి 4 కోట్లు అందుకుంటోంది. ఇక 'సరిలేరు నీకెవ్వరు'తో రీ ఎంట్రీ ఇస్తోన్న విజయశాంతి 3 కోట్ల పారితోషికం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే శ్రద్ధా కపూర్ 5 కోట్లు తీసుకుందని తెలుస్తోంది. 4 భాషల్లో రిలీజ్ అయ్యే సినిమా కావడం వల్లనే ఆమె ఆ స్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేసిందని చెప్పుకుంటున్నారు.
Wed, Aug 07, 2019, 12:19 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View