బోయపాటిని రంగంలోకి దిగమన్న బాలకృష్ణ
Advertisement
'కథానాయకుడు' .. 'మహానాయకుడు' సినిమాల తరువాత బాలకృష్ణ తన తదుపరి సినిమాను బోయపాటితో చేయనున్నట్టుగా చెప్పాడు. అయితే కొన్ని కారణాల వలన బాలకృష్ణ కేఎస్ రవికుమార్ ప్రాజెక్టును ముందుకు తీసుకురాగా, బోయపాటి సినిమా వెనక్కివెళ్లింది. ఈ గ్యాప్ పెరుగుతుండటంతో ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చుననే ప్రచారం కూడా జోరుగానే జరుగుతోంది.

అయితే, ఈ ప్రాజెక్టు ఉందనేది తాజా సమాచారం. కేఎస్ రవికుమార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల మొదటివారంలో మొదలు కానుంది. డిసెంబర్ 21న గానీ .. సంక్రాంతికి గానీ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేలా అన్నీ సిద్ధం చేసుకోమని బోయపాటికి బాలకృష్ణ చెప్పినట్టుగా సమాచారం. ఈ సినిమా తరువాత బాలకృష్ణ 'పింక్' రీమేక్ లో చేయనున్నట్టుగా తెలుస్తోంది.
Wed, Aug 07, 2019, 11:57 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View