రామోజీ ఫిలిం సిటీలో 'సాహో' ప్రీ రిలీజ్ వేడుక
Advertisement
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందింది. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది. ఈ సినిమాతో శ్రద్ధా కపూర్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు వున్నాయి. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. 
Wed, Aug 07, 2019, 11:35 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View