అలాంటి కథల్లో నాకూ చేయాలనే వుంది: హీరోయిన్ రకుల్
Advertisement
ఇటీవలే హిందీలో అజయ్ దేవగణ్ సరసన నటించిన రకుల్, తెలుగులో నాగార్జున సరసన 'మన్మథుడు 2' చేసింది. తనకంటే వయసులో చాలా పెద్దవారైన సీనియర్ హీరోలతో నటించడం వలన ఆమెకి విమర్శలు ఎదురవుతున్నాయి. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే సత్తా లేకపోవడం వల్లనే ఆ తరహా సినిమాలు ఆమె చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాలపై తాజాగా రకుల్ స్పందిస్తూ .. "ఒక వైపున సీనియర్ హీరోలతో చేస్తూనే, మరో వైపున యంగ్ హీరోలతోను చేస్తున్నాను. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతోను .. తెలుగులో నితిన్ తోను చేస్తున్నాను. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని నాకూ వుంది. కానీ 'చేద్దాం' అనిపించే కథలు ఇంతవరకూ రాలేదు. మంచి కథ అనిపిస్తే చేయడానికి నేను సిద్ధంగానే వున్నాను" అని చెప్పుకొచ్చింది. 
Wed, Aug 07, 2019, 11:17 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View