సుష్మాస్వరాజ్ భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి
07-08-2019 Wed 10:20
- సుష్మాస్వరాజ్ కు నివాళి అర్పించిన కిషన్ రెడ్డి
- తీవ్ర భావోద్వేగానికి గురైన కేంద్ర మంత్రి
- యావత్ తెలంగాణకు ఆమె చిన్నమ్మ అంటూ వ్యాఖ్య

గుండెపోటుతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ నిన్న రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె పార్థివదేహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా, తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన... కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సుష్మాస్వరాజ్ యావత్ తెలంగాణకు చిన్నమ్మ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె అందించిన సహకారాన్ని రాష్ట్ర ప్రజలు మరవలేరని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఆమె తపించేవారని... తమలాంటి వారికి ఆమె స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
More Latest News
ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
17 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
21 minutes ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
32 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
2 hours ago
