నా పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి: తమన్నా
Advertisement
గుజరాత్ లో పుట్టి పెరిగినా, గడచిన పుష్కర కాలంగా దక్షిణాది అమ్మాయిగా మారిపోయి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన తమన్నాకు పెళ్లి వయసు వచ్చేసిందని ఆమె తల్లి భావిస్తోందట. తన కుమార్తెకు మంచి వరుడిని వెతికే ప్రయత్నంలో ఉందట. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా వెల్లడించింది.

ఇంట్లో తనకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారని, ఇది అమ్మ నిర్ణయమేనని, ప్రస్తుతం ఆమె వరుడిని వెతికే ప్రయత్నాలను ముమ్మరం చేసిందని చెప్పుకొచ్చింది. తాను ఎవరిని వివాహం చేసుకోవాలన్న విషయాన్ని అమ్మానాన్నలకే వదిలేశానని చెప్పిన తమ్మూ, ఈ మధ్య తనపై వచ్చిన ప్రేమ, డేటింగ్ వార్తలన్నీ వదంతులేనని మండిపడింది. తాను ఎవరినీ ఇంతవరకూ ప్రేమించలేదని, ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా మీడియాకే చెబుతానని అంటోంది. కాగా, ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ విశాల్‌ కు హీరోయిన్ గా 'పెట్రోమ్యాక్‌' అనే సినిమాలో నటిస్తోంది.
Wed, Aug 07, 2019, 08:30 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View