సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  ఆమధ్య నయనతార తమిళంలో నటించిన 'తిరునాల్' చిత్రాన్ని ఇప్పుడు 'వీడే సరైనోడు' పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. జీవా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 23న తెలుగు నాట రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  తాజాగా నాగార్జున కథానాయకుడుగా 'మన్మథుడు 2' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తదుపరి సినిమా విషయంలో తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేసే చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం.
*  రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిస్కో రాజా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ఈ నెల 4 నుంచి జరుగుతున్న ఈ షూటింగులో ఢిల్లీలోని బిజీ రోడ్లపై రవితేజపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
Wed, Aug 07, 2019, 07:21 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View