నాగ్ మనసు దోచేసిన వెన్నెల కిషోర్
Advertisement
నాగార్జున అభిమానులంతా 'మన్మథుడు 2' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగార్జున బిజీగా వున్నారు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన వెన్నెల కిషోర్ గురించి ప్రస్తావించారు.

"వెన్నెల కిషోర్ ఎంతో టాలెంట్ వున్న యాక్టర్. ఈ సినిమాకి ఆయన వెన్నెల వంటివాడు. సెట్స్ లో ఎప్పుడూ సరదాగా ఉంటూ సందడి చేశాడు. ఆయన వేసిన జోకులకి ఎన్నిసార్లు నవ్వుకున్నామో. 'మన్మథుడు' చేస్తున్నప్పుడు ఎంతగా నవ్వుకుంటూ చేశానో, వెన్నెల కిషోర్ కారణంగా ఈ సినిమా కూడా అంతగానే నవ్వుతూ చేశాను. వెన్నెల కిషోర్ ను నేను చాలా మిస్ అవుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Tue, Aug 06, 2019, 05:23 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View