సీఎం కేసీఆర్ ఇంటి ముందు ‘డబుల్ బెడ్రూమ్’ లొల్లి.. 52 మంది అరెస్ట్!
24-07-2019 Wed 12:07
- హైదరాబాద్ లోని ప్రగతిభవన్ వద్ద ఘటన
- కేసీఆర్ ఇంటివద్దకు అంకాపూర్ గ్రామస్తులు
- పంజాగుట్ట పీఎస్ కు తరలించిన పోలీసులు

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయమై హైదరాబాదులోని ముఖ్యమంత్రిని కలుసుకుందామని వచ్చిన గ్రామస్తులకు షాక్ తగిలింది. సీఎం ఇంటివద్దకు అనుమతి లేకుండా భారీ సంఖ్యలో ప్రజలు చేరుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు, వారిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామస్తులు 52 మంది ఈరోజు హైదరాబాద్ లోని ప్రగతిభవన్ వద్దకు చేరుకున్నారు.
తమ ఊరిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు. ప్రగతిభవన్ వద్దకు చేరుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో సీఎం కేసీఆర్ లేదా కల్వకుంట్ల కవిత లేదా జీవన్ రెడ్డి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వీరందరినీ అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
9 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
10 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
10 hours ago
