‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఒక అద్భుతమైన, పవర్‌ఫుల్ ప్రేమకథ: కరణ్ జోహార్
Advertisement
‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఒక అద్భుతమైన, పవర్‌ఫుల్ ప్రేమకథ అని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెలిపారు. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన హిందీ రీమేక్ హక్కుల్ని కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సినిమాను చూసిన కరణ్ దీనిపై ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ చిత్రాన్ని తాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ‘డియర్ కామ్రేడ్’ ఒక  అద్భుతమైన, పవర్‌ఫుల్ ప్రేమకథా చిత్రమని కరణ్ కితాబిచ్చారు. ఈ చిత్రానికి జస్టిస్ ప్రభాకరణ్ అందించిన సంగీతం మరో అద్భుతమన్నారు. విజయ్ దేవరకొండ బ్రిలియంట్ అని, రష్మిక చాలా బాగా నటించిందని, నటీనటులందరి నటన అత్యుత్తమమని అన్నారు. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ ఈ అందమైన ప్రేమకథను రీమేక్ చేయబోతోందని కరణ్ జోహార్ ట్వీట్‌లో వెల్లడించారు.
Tue, Jul 23, 2019, 09:05 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View