మహానుభావులు నడయాడిన సభలో జగన్ లాంటి వ్యక్తులను చూడటం దురదృష్టకరం: ఆలపాటి రాజా
Advertisement
పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు నడయాడిన సభలో జగన్ లాంటి వ్యక్తులను చూడటం దురదృష్టకరమని మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సభ్యులను అగౌరవ పరిచేందుకో, కక్షలు, కార్పణ్యాలకో అసెంబ్లీ వేదిక కాకూడదన్నారు. ప్రజల పక్షాన నిలిచే నేతల గొంతు నొక్కడం దౌర్భాగ్యమని రాజా పేర్కొన్నారు.

మేనిఫెస్టోని దేవుడితో పోల్చిన జగన్, ఆ దేవుడినే విస్మరించడమేంటని ప్రశ్నించారు. అమ్మఒడి పథకాన్ని ఒక్క బిడ్డకు మాత్రమే పరిమితం చేయడాన్ని రాజా తప్పుబట్టారు. కాపు రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరి తెలపాలన్నారు. పాలనలో నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, వైసీపీ నేతల వేధింపుల కారణంగా 40 మంది ఆత్మహత్య చేసుకున్నారని రాజా విమర్శించారు.

Tue, Jul 23, 2019, 08:36 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View