చంద్రయాన్-2 ప్రయాణంపై తాజా వివరాలు వెల్లడించిన ఇస్రో
Advertisement
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2పై తాజా వివరాలు వెల్లడించింది. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (జీఎస్ఎల్వీ) ఎంకే3ఎం1 ద్వారా సోమవారం చంద్రయాన్-2 నింగికెగసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇస్రో వర్గాలు స్పందిస్తూ, ప్రస్తుతం చంద్రయాన్-2 భూస్థిర కక్ష్యలో సరైన దిశలోనే పయనిస్తోందని తెలిపాయి. చంద్రయాన్-2లో వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని ఓ అధికారి వెల్లడించారు. అందులో ఎలాంటి సందేహంలేదని అన్నారు.  అయితే, ఈ ప్రస్థానంలో ఓ చిన్న మైలురాయి ఉందని, అయితే అదేంటో ఇప్పుడు చెప్పలేమని, తగిన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు.
Tue, Jul 23, 2019, 07:54 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View