'గుణ 369' నుంచి మనసుకు పట్టే పాట
Advertisement
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ కథానాయకుడిగా 'గుణ 369' రూపొందుతోంది. 'అనఘ' కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి, తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు.

"మనసుకిది గరళం .. గరళం, సెకనుకొక మరణం .. మరణం" అంటూ ఈ పాట సాగుతోంది. 'దిశ తెలియదే .. నిశి చెరగదే' .. 'మొదటి పుటలోనే తడబడి వలపు కథ విలపిస్తున్నది' వంటి పద ప్రయోగాలు బాగున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడీ సాంగ్స్ లో ఇది ఒకటిగా చేరిపోతుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. విజయ్ యేసుదాస్ - శ్వేతా మోహన్ ఆలాపనతో ఈ పాట యూత్ కి అనుభూతి పరిమళాన్ని అందించేదిగా వుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tue, Jul 23, 2019, 12:08 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View