'హాయ్ రబ్బా' సాంగ్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది: సింగర్ స్మిత
Advertisement
తెలుగు ఆల్బమ్స్ లో సింగర్ స్మిత చేసిన 'హాయ్ రబ్బా' ఆమెకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ ఆల్బమ్ లోని 'హాయ్ రబ్బా' సాంగ్ ఇప్పటికీ కుర్రకారు మనసులను దోచేస్తూనే ఉంటుంది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడింది.

" మా నాన్నగారు వాళ్లది విజయవాడ అయినప్పటికీ, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. 'పాడుతా తీయగా' కార్యక్రమానికి నాకు తెలియకుండా మా అమ్మ నా టేప్ పంపించింది. ఆ పాటలు విని వాళ్లు నన్ను పిలిపించి సెలెక్ట్ చేశారు. ఆ స్టేజ్ పై పాడటం జీవితంలో మరిచిపోలేని అనుభవం. అప్పటి నుంచి పాటలపై మరింత శ్రద్ధ పెడుతూ వెళ్లాను. అలా నేను చేసిన 'హాయ్ రబ్బా' ఆల్బమ్ కి మంచి పేరు వచ్చింది" అని చెప్పుకొచ్చింది.
Tue, Jul 23, 2019, 11:46 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View