'సాహో' నుంచి తొలిసారి రొమాంటిక్ పోస్టర్!
Advertisement
వచ్చే నెలలో విడుదలకు సిద్ధమైన 'సాహో' ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ కాగా, ఇప్పుడో రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇండియాలోని పలు భాషల్లో ఈ చిత్రాన్ని ఒకే రోజు విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ఇంకా ముందే విడుదల చేయాలని భావించినప్పటికీ, గ్రాఫిక్స్ ఆలస్యమైన కారణంగా రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రొడ్యూసర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 
Tue, Jul 23, 2019, 09:52 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View