సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  అమలాపాల్ నాయికగా ఇటీవల వచ్చిన 'ఆమె' సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశపరచింది. తమిళ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కీ ఆదరణ దక్కలేదు. అయితే, ఈ సినిమా విషయంలో అమలాపాల్ తన గొప్పతనాన్ని చాటుకుందట. సినిమా విడుదలకి ముందు నిర్మాత ఫైనాన్షియర్లకి డబ్బు చెల్లించలేకపోవడంతో అమలాపాల్ తన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేయడమే కాకుండా, మరికొంత డబ్బు కూడా సర్దుబాటు చేసి సినిమా విడుదలకి సహకరించిందట. ఈ విషయాన్ని చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.
*  రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిస్కో రాజా' చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. కాగా, తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకి గాను తమిళ నటుడు బాబీ సింహాను తీసుకున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  గత కొన్నాళ్లుగా వెనుకబడిపోయిన దర్శకుడు కృష్ణవంశీ 'రుద్రాక్ష' సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టనున్నాడంటూ ఇటీవల వార్తలు రావడం, అందులో వాస్తవం లేదని ఆయన ఖండించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.  
Tue, Jul 23, 2019, 07:25 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View