ఈ నరసింహన్ రాష్ట్రాన్ని వదిలి వెళ్తున్నా, ఆ 'నరసింహులు' మీతోనే ఉంటారు: గవర్నర్ చమత్కారం
Advertisement
ఏపీతో తనకు అవినాభావ సంబంధం ఉందని, విజయవాడలోనే తన అక్షరాభ్యాసం జరిగిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. గవర్నర్ కు వీడ్కోలు కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి గవర్నర్ గా వస్తానని తానెప్పుడూ అనుకోలేదని అన్నారు.

గడచిన పదేళ్లు ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిదని, ఈ 34 రోజులుగా జగన్ పాలనలో ప్రతి బాల్ సిక్సర్, బౌండరీలను తాకుతున్నట్టు ఉందని ప్రశంసించారు. జగన్ తన పాలనలో మరిన్ని సెంచరీలు చేయాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన మంత్రులు, అధికారులకు తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ నరసింహన్ రాష్ట్రాన్ని వదిలి వెళ్తున్నా, అహోబిలం, సింహాచలం, మంగళగిరి నరసింహులు మీతోనే ఉంటారని వ్యాఖ్యానించారు. 
Mon, Jul 22, 2019, 08:21 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View