విజయవాడలో గవర్నర్ నరసింహన్ కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఏపీకి కొత్త గవర్నర్ గా హరిచందన్ ను ఇటీవల నియమించారు. ఈ నేపథ్యంలో నరసింహన్ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. స్థానిక గేట్ వే హోటల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్, మంత్రులు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు హాజరయ్యారు. నరసింహన్ కు శాలువా కప్పి సన్మానించిన జగన్, ఆయనకు శ్రీ వేంకటేశ్వరుడి విగ్రహాన్ని అందజేశారు. అలాగే, గవర్నర్ భార్యకు జగన్ భార్య భారతి ఓ కానుక అందజేశారు.
Mon, Jul 22, 2019, 08:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View