‘ఇస్మార్ట్ శంకర్’ కాన్సెప్ట్ నాదే.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశాం!: హీరో ఆకాశ్
Advertisement
చాలా కాలం తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ మంచి హిట్ కొట్టారు. రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ సినిమా వ్యక్తి మెదడును మార్పిడి చేయడమనే కాన్సెప్ట్‌తో రూపొందింది. అయితే ఈ కాన్సెప్ట్ తను తయారు చేసిన కథదని, తననే హీరోగా పెట్టి రాధ అనే దర్శకురాలు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారని ‘ఆనందం’ ఫేమ్ ఆకాశ్ తెలిపాడు.

ఈ సినిమా తమిళ్‌లో ఇప్పటికే ‘నాన్ యార్’ పేరుతో విడుదలైందని, తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆకాశ్ పేర్కొన్నాడు. అదే సమయంలో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ తమను షాక్‌కు గురి చేసిందని, ఈ విషయమై పూరిని సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదన్నాడు. తక్షణమే తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసి, మీడియాను ఆశ్రయించామన్నాడు. సమస్య సామరస్యంగా పరిష్కారం కాకుంటే, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆకాశ్ తెలిపాడు.
Mon, Jul 22, 2019, 07:51 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View