ఎంతో కష్టపడి పైకొచ్చాను: సంగీత దర్శకుడు కోటి
Advertisement
సంగీత దర్శకుడిగా ఎన్నో వందల సినిమాలకి పని చేసిన కోటి, ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'కోటప్ప కొండ'లోని కోటేశ్వరస్వామి పేరును అమ్మానాన్నలు నాకు పెట్టారు. స్కూల్లో కూడా అంతా నన్ను 'కోటి' అనే పిలిచేవారు.

ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా అందరికీ 'కోటి'గానే పరిచయమయ్యాను. మధ్యలో కొంతమంది పూర్తి పేరు వేసుకోమని సూచించారు. నేను మాత్రం 'కోటి'నే బాగుందనుకుని అలాగే నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఎక్కడా ఎలాంటి వివాదాల జోలికి పోకుండా, సంగీతం పరంగా ఎవరూ వేలెత్తి చూపకూడదనే ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డాను. అహర్నిశలు పడిన కష్టానికి ఫలితం దక్కింది .. అభిమానుల హృదయాల్లో నా కంటూ ఒక మంచి స్థానం దక్కింది" అని చెప్పుకొచ్చారు.
Mon, Jul 22, 2019, 06:23 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View