నాన్న సూచనతో నా పద్ధతి మార్చుకున్నాను: 'అల్లరి' నరేశ్
Advertisement
తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ కి మంచి పేరుంది. ఆయన ఖాతాలో విజయాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన షూటింగుకి ఆలస్యంగా వస్తారనే ఒక టాక్ వుంది. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు.

"ఒకప్పుడు నేను షూటింగులకు ఆలస్యంగా వెళ్లిన మాట నిజమే. ముందురోజు రాత్రి షూటింగు నుంచి రావడం ఆలస్యమైతే, ఆ ప్రభావం మరుసటి రోజు ఉదయాన్నే వున్న షూటింగుపై పడేది. దాంతో షూటింగులకు లేట్ గా వస్తాడనే ప్రచారం ఎక్కువైపోయింది. ఈ విమర్శ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడమని నాన్న నాకు చెప్పారు. నాన్న సూచనతో ఆలోచనలో పడ్డాను. ఒక సినిమా షూటింగుకి .. మరో సినిమా షూటింగుకి మధ్య గ్యాప్ ఉండేలా చూసుకున్నాను. అలా ఆ విమర్శ నుంచి బయటపడ్డాను" అని చెప్పుకొచ్చాడు.
Mon, Jul 22, 2019, 06:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View