‘దండుపాళ్యం 4’ ను ఆగస్టు 15న విడుదల చేస్తాం: చిత్ర దర్శక నిర్మాతలు
Advertisement
ఎలాంటి అవాంతరాలు ఎదురైనా సరే, ‘దండుపాళ్యం 4’ చిత్రాన్ని ఆగస్టు 15న కచ్చితంగా విడుదల చేస్తామని ఈ చిత్ర దర్శక నిర్మాతలు కేటీ నాయక్, వెంకట్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, అనేక ఆసక్తికరమైన అంశాలతో ‘దండుపాళ్యం 4’ ఉండబోతోందని అన్నారు. ఇప్పటికే ‘దండుపాళ్యం’ మూడు భాగాలు విడుదలయ్యాయని, వీటికి ‘దండుపాళ్యం 4’ సీక్వెల్ కాదని స్పష్టం చేశారు. జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది, అవి ఫలించాయా? లేవా? పోలీసుల ఎత్తుగడలకు ఈ దండు చిత్తయిందా? గెలిచిందా? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు చెప్పారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉందని తెలిపారు. కాగా, ఈ చిత్రంలో బెనర్జీ, ముమైత్ ఖాన్, సంజీవ్ కుమార్, సుమన్ రంగనాథన్ తదితరులు నటించారు. 
Mon, Jul 22, 2019, 05:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View