చిరూతో ఒకసారి కాదు .. నాలుగుసార్లు ఛాన్స్ మిస్ అయింది: పూరి
Advertisement
ఆ మధ్య చిరంజీవితో 'ఆటో జాని' సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే సెకండాఫ్ చిరంజీవికి నచ్చకపోవడం వలన, ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. తాజా ఇంటర్వ్యూలో పూరి ఈ విషయాన్ని గురించి స్పందిస్తూ, "మెగాస్టార్ తో నేను సినిమా చేయడానికి ప్రయత్నించడం .. ఆ ప్రయత్నం విఫలం కావడం 'ఆటోజానీ'కి ముందు మూడుసార్లు జరిగింది.

అంటే ఆటోజానీతో కలుపుకుంటే చిరంజీవిగారితో సినిమా చేయాలనుకుని నాలుగుసార్లు మిస్ అయ్యాను. దురదృష్టవశాత్తు రెండు సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ఈ సారి మాత్రం చిరంజీవిగారు ఓకే అంటే 5 రోజుల్లో కథ రెడీ చేసేస్తాను. చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో సినిమా చేసే ఛాన్స్ త్వరలో వస్తుందనే ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Mon, Jul 22, 2019, 05:05 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View