మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీగా '22'
Advertisement
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో మరో థ్రిల్లర్ మూవీ రూపొందనుంది .. ఆ సినిమా పేరే '22'. రూపేశ్ కుమార్ - సలోని మిశ్రా నాయకా నాయికలుగా పరిచయమవుతున్న ఈ సినిమాకి శివకుమార్ బి. దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. దివంగత దర్శకురాలు జయ.బి - బీఏ రాజు దంపతుల కుమారుడే ఈ శివకుమార్.

హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరో హీరోయిన్లపై వెంకటేశ్ క్లాప్ ఇవ్వగా, ముహూర్తపు సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 29 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జరుగుతుందనీ, కథకీ .. 22 అనే నెంబర్ కి గల సంబంధం ఏమిటనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని దర్శకుడు శివకుమార్ బి. చెప్పాడు.

Mon, Jul 22, 2019, 04:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View