చిరూ, కొరటాల మూవీ ఫస్టు షెడ్యూల్ షూటింగ్ అక్కడేనట
Advertisement
చిరంజీవి 152వ సినిమాకి కొరటాల దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'సైరా' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్న చిరంజీవి, ఆ వెంటనే కొరటాల ప్రాజెక్టు పైకి రానున్నట్టుగా చెబుతున్నారు. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ సినిమాను లాంచ్ చేసి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించే ఆలోచనలో కొరటాల వున్నాడు.

ఈ సినిమా కథ కొంత గ్రామీణ నేపథ్యంలో సాగుతుందట. అందుకు సంబంధించిన సన్నివేశాలను 'పలాస' పరిసర ప్రాంతాల్లో జరపడానికి కొరటాల ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. దాదాపు 20 రోజుల పాటు అక్కడ తొలి షెడ్యూల్ షూటింగును జరపనున్నారు. ఈ సినిమాలోను వినోదంతో పాటు సామాజిక సందేశం ఉండేలా కొరటాల చూసుకున్నాడని అంటున్నారు. 
Mon, Jul 22, 2019, 04:03 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View