బన్నీని మెప్పించిన సుకుమార్!
Advertisement
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చకచకా చిత్రీకరణను జరుపుకుంటోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఒక వైపున ఈ సినిమా చేస్తూనే మరో వైపున తదుపరి ప్రాజెక్టులపై బన్నీ దృష్టి పెట్టాడు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల అల్లు అర్జున్ ను కలిసిన సుకుమార్ ఫస్టాఫ్ స్క్రిప్ట్ ను వినిపించాడట. ఫస్టాఫ్ పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిన బన్నీ, సెకండాఫ్ ను అంతకన్నా పట్టుగా సిద్ధం చేయమని చెప్పాడట. ప్రస్తుతం తన టీమ్ తో కలిసి సుకుమార్ అదే కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. మరో వైపున వేణు శ్రీరామ్ 'ఐకాన్' స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో వున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా స్క్రిప్ట్ ను ఓకే చేయించుకుంటే వాళ్లతో బన్నీ సెట్స్ పైకి వెళతాడన్న మాట.

Mon, Jul 22, 2019, 03:01 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View