బాలకృష్ణ జోడీగా పాయల్ రాజ్ పుత్
Advertisement
బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి నిర్మాత సి. కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా .. గ్యాంగ్ స్టార్ గా ఆయన రెండు పాత్రలను చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం వుంటుందనే వార్తలు షికారు చేశాయి. ఒక కథానాయిక బోల్డ్ గా కనిపించాల్సి ఉండటంతో, పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించవలసి వుంది. ఈ సినిమాకి 'క్రాంతి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
Mon, Jul 22, 2019, 02:19 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View